Thursday, 14 December 2017

Public Gardens Walkers Club program on Telangana Formation Day.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తడక కుమారస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రీడల బహుమతుల ప్రదానోత్సవం తేదీ 01-06-2017 సాయంత్రం 5 గంటల నుండి నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో విజేతలకు ప్రముఖుల చే బహుమతి ప్రదానం ఉంటుంది అని అధ్యక్షుడు కుమారస్వామి వెల్లడించారు తదుపరి సాంస్కృతిక కార్యదర్శి తమ్మెర వెంకట్ బృందం వారిచే సంగీత విభావరి నిర్వహించ బడును అందు మధుర గాయని కుమారి మధులత గారికి అవార్డ్ ప్రదానోత్సవం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు,నగర మేయర్ నన్నపనేని నరేందర్ గారు,పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి గారు, కలెక్టర్ ఆమ్రపాలి గారు, కమిషనర్ శృతి ఓజా గారు, 39 డివిజన్ కార్పొరేట్ వేముల శ్రీనివాస్ గారు లు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాకర్స్ వారి కుటుంబ సభ్యులు, నగర ప్రజలు మరియు ప్రింట్ మీడియా అందరూ తప్పక పాల్గొనాలని వెంకట్రామిరెడ్డి,     నాన్నేసాహెబ్, గిరిజ, విజయ్, సి ఎన్ రావు , ఎల్లగౌడ్, వేణుగోపాల స్వామి, ప్రసాద్, అనంత్, వెంకట్, రాజమౌళి, కళ్యాణి మరియు శ్రీనివాస్ రెడ్డి అన్నారు



No comments:

Post a Comment